ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు
సామర్లకోట మేజర్ న్యూస్ : కార్తీకమాసం ఉత్సవములు పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉపలోకాయుక్త పి.రజని కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని సోమవారం భీమేశ్వరస్వామివారిని,బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం నంది మండపం నందు దేవస్థానము అర్చకులు, వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేసారు.ఈ సందర్భంగా ఆలయ అధికారి శ్రీస్వామివారి ప్రసాదములు,స్వామివారి చిత్రపటం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మెన్ కంటే జగదీష్ మోహనరావు (బాబు) మరియు ధర్మకర్తల సభ్యులు, సామర్లకోట రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.