బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్
అడ్డతీగల, సూర్య ప్రతినిధి : ఏజెన్సీ మండల కేంద్రమైన అడ్డతీగల లోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొనే ఉద్యోగస్తుల బ్యాలెట్ ఓటింగ్ నమోదు ప్రక్రియ నిర్వహించారు. ఈ బ్యాలెట్ ఎన్నిక ప్రక్రియ విధానాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వి రాజ్ కుమార్ పర్యవేక్షించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం విధి విధానాలకు అనుగుణంగా పగడ్బందీగా నిర్వహించాలని స్థానిక సిబ్బందికి సూచించారు బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బ్యాలెట్ ఓటింగ్ ముగిసిన తర్వాత స్థానిక ఎంపీడీవో కుమార్ మాట్లాడుతూ మొత్తం 294 బ్యాలెట్ ఓటింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.