BREAKING
పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనం..అంతరంగంలోని చీకట్లను తొలగించుకునే పరమ పవిత్ర ఘట్టం 'తూ మిల్ జాయే' షూటింగ్‌లో దీపికా పదుకొణెను ఉత్సాహపరిచిన రణ్‌వీర్ సింగ్.. కొరియోగ్రాఫర్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు ఇవే! 58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి . వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం 'రామాయణ' చిత్రంపై వాటికన్ కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ప్రశంసలు.. సార్వత్రిక సందేశంపై ప్రత్యేక వ్యాఖ్యలు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నిత్యాన్నదానానికి రూ.20 వేల విరాళం అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఈవో ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి -ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్..52,520 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం -పరారైన మరో ఇద్దరి కోసం గాలింపు.. జూదంపై కఠిన చర్యలు : ఎస్సై నాగేంద్ర

Select Suryaa Now
పేకాట స్థావరంపై పోలీసుల దాడి -ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్..52,520 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం -పరారైన మరో ఇద్దరి కోసం గాలింపు.. జూదంపై కఠిన చర్యలు : ఎస్సై నాగేంద్ర

తిరుపతి టాస్క్ ఫోర్స్ : జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు పుత్తూరు పట్టణ పరిధిలోని పేకాట స్థావరంపై పుత్తూరు అర్బన్ పోలీసులు దాడి నిర్వహించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.52,520 నగదుతో పాటు ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మరో ఇద్దరు పరారయ్యారు. ఈ మేరకు సోమవారం పుత్తూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై నాగేంద్ర వీడియోతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణంలోని గణపతి నగర్ సమీపంలో ఉన్న తొర్రూరు చెరువు కట్టపై కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పుత్తూరు డిఎస్పీ పర్యవేక్షణలో సోమవారం పుత్తూరు అర్బన్ పోలీసులు సంబంధిత ప్రాంతంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని గుర్తించి, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.52,520 నగదు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించి పరారైన మరో ఇద్దరిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ దాడిలో పుత్తూరు అర్బన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య, ఎస్‌ఐ నాగేంద్ర, హెడ్ కానిస్టేబుళ్లు విలియం, మునికృష్ణ, కానిస్టేబుళ్లు వేలు, ఉదయ్, మురళి, హోంగార్డులు గోపి, భాస్కర్, నాగరాజు, ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్ పద్మనాభంతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్