మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు '
తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన జేబీ శ్రీనివాస్ ను తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నేత పులిగోరు మురళీ కృష్ణారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ తో పాటు కార్పొరేటర్ అందరికీ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి శాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు. మేయర్ ను ఆయన ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, జేబీ రమణ, శరత్ చౌదరి, కార్పొరేటర్ గంజి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.