BREAKING
పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనం..అంతరంగంలోని చీకట్లను తొలగించుకునే పరమ పవిత్ర ఘట్టం 'తూ మిల్ జాయే' షూటింగ్‌లో దీపికా పదుకొణెను ఉత్సాహపరిచిన రణ్‌వీర్ సింగ్.. కొరియోగ్రాఫర్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు ఇవే! 58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి . వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం 'రామాయణ' చిత్రంపై వాటికన్ కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ప్రశంసలు.. సార్వత్రిక సందేశంపై ప్రత్యేక వ్యాఖ్యలు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నిత్యాన్నదానానికి రూ.20 వేల విరాళం అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఈవో ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్

కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,

Select Suryaa Now
కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో విధుల నిర్వహణలో అప్రమత్తత, క్రమశిక్షణ, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సోమవారం శాలిగౌరారం సర్కిల్ కార్యాలయం, కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలోని రికార్డులు, కేసుల పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అనంతరం కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, నిర్వహణ, సిబ్బంది విధులు, స్టేషన్ రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం, భరోసా కలిగించాలని తెలిపారు.

గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

ఈ తనిఖీల్లో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాజశేఖర్, హరిబాబు, కేతపల్లి ఎస్ఐ రవికుమార్, కట్టంగూర్ ఎస్ఐ క్రాంతికుమార్, ఏఎస్ఐ అంజయ్య, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.