BREAKING
కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో

512 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు

Select Suryaa Now
512 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు

హైదరాబాద్‌: కృష్ణా జలాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ అబద్ధాలనే నమ్ముకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని, ఏపీకి నీళ్లు దోచిపెడుతున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే, ఏపీలో వైఎస్‌ జగన్ పల్నాడు వాటర్ గ్రిడ్‌కు జీవో ఇచ్చారని, ఇరువురి మధ్య సత్సంబంధాలు ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం వెలువడిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 578 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, ప్రతి ఏడాది మాట్లాడుకునే వెసులుబాటు ఉన్నా 2020లో ఒకేసారి ఏపీకి 512 టీఎంసీల నీళ్లను తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల దోపిడీని ఆపే శక్తి లేకపోతే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎందుకు అడ్డుకోలేదని సీఎం ప్రశ్నించారు.

కేసీఆర్‌ హయాంలోనే ఏపీ కృష్ణా నది జలాలను మళ్లించుకుపోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2023-24లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం 119 టీఎంసీల నీటినే వాడుకుంటే, తమ ప్రభుత్వం 2024-25లో 285 టీఎంసీల నీటిని వినియోగించుకుందని ఆయన గణాంకాలతో వివరించారు. ఏపీ అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే, గత ప్రభుత్వం తెలంగాణలో ఏం చేసిందని నిలదీశారు. ఎస్‌ఎల్‌బీసీ (SLBC), కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని, డిండి, అచ్చంపేట, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులు పదేళ్లపాటు వృథాగా పడి ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు రూ. 2.20 లక్షల కోట్ల బిల్లులు చెల్లించినా రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని సీఎం ఆరోపించారు.

మరోవైపు, సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. 512:299 టీఎంసీల పంపిణీ అనేది కృష్ణా జలాల ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేదాకా మాత్రమే వర్తించే తాత్కాలిక ఏర్పాటు అని, ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై తాము అపెక్స్ కౌన్సిల్, ట్రిబ్యునళ్లలో పోరాడామని బీఆర్‌ఎస్‌ వర్గాలు వాదిస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో విఫలమవుతోందని ఆ పార్టీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.