BREAKING
పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనం..అంతరంగంలోని చీకట్లను తొలగించుకునే పరమ పవిత్ర ఘట్టం 'తూ మిల్ జాయే' షూటింగ్‌లో దీపికా పదుకొణెను ఉత్సాహపరిచిన రణ్‌వీర్ సింగ్.. కొరియోగ్రాఫర్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు ఇవే! 58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి . వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం 'రామాయణ' చిత్రంపై వాటికన్ కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ప్రశంసలు.. సార్వత్రిక సందేశంపై ప్రత్యేక వ్యాఖ్యలు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నిత్యాన్నదానానికి రూ.20 వేల విరాళం అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఈవో ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్

13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ

Select Suryaa Now
13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ

తిరుపతి, మేజర్ న్యూస్:
తిరుపతి కార్పొరేషన్ 13 డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఎస్వీ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమె ప్రమాణ స్వీకారం చేసి మీడియాతో మాట్లాడారు.  తనను కార్పొరేటర్ గా గెలిపించిన 13 డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. డివిజన్లోని ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా సాయం చేయడంలో ముందు ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో  దృష్టి సారిస్తానని చెప్పారు. డివిజన్లోని సమస్యలన్నిటిని పరిష్కరించి ఆదర్శ డివిజన్ గా చేసేందుకు అధికారులు ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తానని రుక్మిణమ్మ తెలిపారు. కార్పొరేటర్ రుక్మిణమ్మ తన కుమారుడు టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా టౌన్ క్లబ్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి గజ పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా ప్రమాణస్వీకారంతో కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు రుక్మిణమ్మను శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

H. Dwaraka, staff reporter 

9705347341