ప్రకృతి అందాల మధ్య వైద్యుల పక్షుల వీక్షణ!
రంపచోడవరం సూర్య ప్రతినిధి : గుంటూరు, రాజమహేంద్రవరం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన 12 మంది వైద్యులు రెండు రోజుల పాటు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పక్షుల వీక్షణ, ప్రకృతి నడకలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. “అంటమెడ్ నేచర్ ఎక్స్‌పెడిషన్స్” బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ రవీంద్రనాథ్, చాణక్య, జిమ్మీ కార్టర్‌ల ఆధ్వర్యంలో, మారేడుమిల్లి రేంజ్ ఆఫీసర్ కరుణాకర్ , రంపచోడవరం డీఎఫ్‌ఓ సహకారంతో ఈ ప్రకృతి సందర్శన కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా వైద్యులు అటవీ ప్రాంతంలోని వివిధ రకాల పక్షులను వీక్షిస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదించారు. అటవీ జీవవైవిధ్యం, పక్షుల ఆవాసాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలుసుకున్నారు. రెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం వైద్యులకు ప్రకృతితో మమేకమయ్యే మంచి అనుభూతిని అందించింది అనే వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.