BREAKING
కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో

డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్.. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ సందడి

Select Suryaa Now
డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్.. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ సందడి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెరకెక్కిన తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్ జో బచాయ్ హైన్ సంగ్ సమైట్ లో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ డిసెంబర్ 4 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. హమ్‌సఫర్, ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ తర్వాత ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ మరోసారి కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రముఖ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ రాసిన బెస్ట్ సెల్లింగ్ ఉర్దూ నవల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. మూడు తరాల నేపథ్యంలో సాగే ఆరు ప్రేమకథల సమాహారంగా ఇది ఉండబోతుందని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఒక విషాద ఘటన తర్వాత భావోద్వేగాలకు దూరంగా ఉండే సికిందర్ అనే న్యాయశాస్త్ర విద్యార్థి, తన గతానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్న లిజా అనే కళాకారిణి మధ్య ఇటలీలో మొదలయ్యే పరిచయం, వారి ప్రయాణం చుట్టూ ఈ కథనం ఆసక్తికరంగా సాగుతుంది.

ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌లతో పాటు హానియా ఆమిర్, సనమ్ సయీద్, అహద్ రజా మీర్, హమ్జా అలీ అబ్బాసీ, బిలాల్ అష్రఫ్, మాయా అలీ, ఇక్రా అజీజ్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోమినా దురైద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మోమినా దురైద్ నిర్మాతగా, షోరన్నర్‌గా వ్యవహరించిన ఈ ప్రాజెక్టును పాకిస్థాన్, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. నెట్‌ఫ్లిక్స్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా విభాగం ఈ సిరీస్‌ను రూపొందించింది.

రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సిరీస్‌ను 2023 ఆగస్టులోనే తొలిసారి ప్రకటించగా, వివిధ కారణాలతో వాయిదా పడుతూ ఎట్టకేలకు డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరోవైపు భారత్‌లో పాకిస్థానీ కంటెంట్ స్ట్రీమింగ్‌పై ఉన్న ఆంక్షల నేపథ్యంలో ఈ సిరీస్ భారత ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందా లేదా అనే అంశంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. భావోద్వేగాలు, బంధాల సంఘర్షణతో రూపొందిన ఈ సిరీస్ అంతర్జాతీయ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.