BREAKING
512 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి నటుడిగా 51 ఏళ్ల అరుదైన మైలురాయి.. ఘనంగా మోహన్‌బాబు వేడుకలు, తరలివచ్చిన సినీ 47 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ సి మునికృష్ణ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ _2026)ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి పోస్టల్ బ్యాలెట్‌పై కలెక్టర్ ప్రత్యేక నిఘా! కాకినాడ అభివృద్ధికి కూటమిదే భరోసా! డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్.. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ సందడి ప్రకృతి అందాల మధ్య వైద్యుల పక్షుల వీక్షణ! వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు గిరిజన రైతులు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు సన్‌డాన్స్ అవార్డు విజేత 'న్యూసెన్స్ బేర్' చిత్రంతో ఆల్ లివింగ్ థింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ప్రారంభం అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగులు నింపేదే కార్తీకదీపం. శ్రీమఠంలో వైభవంగా తెప్పోత్సవం 'ఆలోచన' ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి.. సీనియర్ సిటిజన్లకు ఉచిత టికెట్ల

'ఆలోచన' ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి.. సీనియర్ సిటిజన్లకు ఉచిత టికెట్ల

Select Suryaa Now
'ఆలోచన' ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి.. సీనియర్ సిటిజన్లకు ఉచిత టికెట్ల

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సురేందర్ చాచా దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు చిత్రం ఆలోచన అధికారిక ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు, మానవత్వం మరియు స్నేహం నేపథ్యంగా సాగే సంభాషణలు ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తాను నటించిన క్లాసిక్ చిత్రం మంచు పల్లకి స్ఫూర్తితో ఆలోచన చిత్రాన్ని రూపొందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలోనూ తల్లిదండ్రులు తమ పిల్లల గురించే ఆలోచిస్తుంటారని, అలాంటి సమయంలో పాత మిత్రులతో కలిసి సమయం గడపడం, ఆలోచనలు పంచుకోవడం వల్ల వారికి కొత్త ఉత్సాహం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా సమాజాన్ని ఆలోచింపజేసే మంచి కథతో రూపొందిందని, ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని చిరంజీవి ఆకాంక్షించారు.

పీఎస్‌జే ఫిల్మ్స్ అండ్ కో బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు జీవీ నారాయణరావు, నరసింహరాజు, ప్రసాద్ బాబు, మహర్షి రాఘవ, జయలలిత, రాజన్ హరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బెన్నీ సుధాకర్ ఈ చిత్రంతో నటుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాకు వియన్ సంగీతం అందించగా, టీ సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.  

మరోవైపు సినిమా విడుదల సందర్భంగా చిత్రబృందం సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు తమ ఆధార్ కార్డు చూపి థియేటర్లలో ఉచితంగా సినిమా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. పెద్దల జీవితాలు, వారి అనుభవాల చుట్టూ అల్లుకున్న ఈ కథాంశం థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.