BREAKING
కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో

ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి

Select Suryaa Now
ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి


రంపచోడవరం సూర్య ప్రతినిధి : రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలవరం జిల్లాలో రెండు విడతలుగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలి విడత పోలింగ్ నవంబర్ 26వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల పరిధిలో, రెండో విడతలో ఏడు మండలాల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో పోలింగ్ నిర్వహించనున్న గ్రామ పంచాయతీల పరిధిలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, గ్రామాల అభివృద్ధి, సమర్థవంతమైన స్థానిక పాలన కోసం ప్రతి ఓటరు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 24వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుందని తెలిపారు. ఆ సమయం తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, మద్దతుదారులు ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను అభ్యర్థులందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఓటర్లు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుని, గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్ కోరారు.
పోలవరం జిల్లా పరిధిలో 2026 నవంబర్ 23వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా, ఐదు మండలాల్లో మొత్తం 1,559 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అడ్డతీగల మండలంలో 294 మంది, దేవీపట్నం మండలంలో 154 మంది, గంగవరం మండలంలో 190 మంది, రాజవొమ్మంగి మండలంలో 325 మంది, రంపచోడవరం మండలంలో అత్యధికంగా 596 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్  ప్రశాంతంగా నిర్వహించారు.