BREAKING
ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి -ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్..52,520 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం -పరారైన మరో ఇద్దరి కోసం గాలింపు.. జూదంపై కఠిన చర్యలు : ఎస్సై నాగేంద్ర కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు

గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆర్జేసీ ప్రత్యేక పర్యవేక్షణ

Select Suryaa Now
గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆర్జేసీ ప్రత్యేక పర్యవేక్షణ

 

అన్నవరం, మేజర్ న్యూస్ : కాకినాడ జిల్లా అన్నవరం  కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం (నవంబర్ 24) నిర్వహించనున్న గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ ఏర్పాట్లను సోమవారం రాజమహేంద్రవరం దేవాదాయ శాఖ ఆర్జేసీ (జోన్-1)  వి.త్రినాథరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావుతో కలిసి ఆర్జేసీ గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మార్గం పొడవునా చేపట్టిన రహదారి మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, భక్తుల రాకపోకలకు అనుకూలంగా చేస్తున్న ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు, వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
భక్తుల భద్రతకు ప్రాధాన్యత
గిరి ప్రదక్షిణ మార్గంలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగించాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంచడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అదేవిధంగా మార్గమంతా తగినంత వెలుతురు ఉండేలా విద్యుత్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని, భక్తులు అలసటకు గురైనప్పుడు సేదతీరేందుకు విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి ఈ సందర్భంగా ఈవో నల్లం సూర్యచక్రధరరావు గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సంబంధించి దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని ఆర్జేసీకి వివరించారు. ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత, రవాణా తదితర విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, గిరి ప్రదక్షిణ కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యదేవుని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శన అనుభవం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆర్జేసీ వి.త్రినాథరావు సూచించారు. మహోత్సవం పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని, విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు ఈఈ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.