బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయండి
- షంషూర్‌కు కప్పు సాసర్ గుర్తుపై ఓటేసి గెలిపించండి
- ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పిలుపు
పామూరు, మేజర్ న్యూస్ : పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేడు వేసే ఓటు ఎంతో విలువైనదని ఆ ఓటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేదిగా ఉండాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పామూరు పట్టణంలోని అనిల్ గార్డెన్స్‌లో మేజర్ పంచాయతీ ఎన్ డి ఏ కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ ఓటును వృథా చేయకుండా గ్రామ అభివృద్ధిని రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షంషూర్‌కు కప్పు సాసర్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంచి వ్యక్తి అయిన షంషూర్‌ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పట్టణంలో స్మశానవాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లును రెవెన్యూ అధికారులతో మాట్లాడి అందుబాటులో ఉన్న స్థలాన్ని గుర్తించాలని స్మశానవాటిక ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్ షంఘర్, ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, యాదాల వెంకట సాయి కిరణ్, అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, డివి మనోహర్, షేక్ హాజీ గౌస్, అమీర్ బాబు, షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.