కర్నూలు,పాత కంట్రోల్ రూమ్ దగ్గర గల దామోదరం సంజీవయ్య స్మారక ఉన్నత పాఠశాల నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు"
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీ పి. వాసు గారి సూచనల మేరకు రాజేంద్ర బాబు, ఫోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి వారు
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సురక్షిత్ బచ్పన్ అభియాన్” (Surakshit Bachpan Abhiyan) కార్యక్రమము లో భాగంగా కర్నూలు,పాత కంట్రోల్ రూమ్ దగ్గర గల దామోదరం సంజీవయ్య స్మారక ఉన్నత పాఠశాల నందు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POCSO Act-2012), ఆన్‌లైన్ భద్రత, లైంగిక వేధింపులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఫిర్యాదు చేసే విధానాలు, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పిల్లలపై ఎవరైనా ఖచ్చితంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు కలవని తెలిపారు. పిల్లలు తమకు సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఆ సమస్యల గురించి తల్లిదండ్రులకు వివరించాలని కోరారు.
అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన మాట్లాడుతూ బాలల భద్రత, హక్కుల పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను గురించి పిల్లలకు వివరించారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుంటే వారి భవిష్యత్తు ఆరోగ్యము నాశనం అవుతాయని తెలిపారు. లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకి ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ విజయ నిర్మల , అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ సులోచన , లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.