అందరి సహకారం తో అభివృద్ధి చేస్తా అవకాశమివ్వండి
*మెట్టూరు సర్పంచ్ అభ్యర్థి పడాల రమణమ్మ.
కొత్తూరు నవంబర్ 23(మేజర్ న్యూస్ ) కొత్తూరు మండలానికి
మెట్టూరు ప్రాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న మెట్టూరు పంచాయితీ ని అందరి సహకారం తో అభివృద్ధి చేస్తానని, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు గెడ్డవలస కమలాకరరావు సూచనలు సలహాలు తీసుకొని అభివృద్ధి పథం లో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి పడాల రమణమ్మ మెట్టూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమె పంచాయతీ పరిది లో పోటీ చేస్తున్న వార్డు మెంబర్ల తో ఇంటింట ప్రచారం చేపట్టారు. ఇప్పటి కే తన స్వంత నిధులతో ప్రతీ సమస్య పరిష్కరించడం జరిగిందని, ఒక్క సారి తమ ప్యానల్ కు గెలిపించాలని రెండో వార్డు అభ్యర్థి గెడ్డవలస కమలాకరరావు తో సహా సర్పంచ్ అభ్యర్థి రమణమ్మ కోరారు. ఇంటింట ప్రచారం లో మహిళలు కుంకుమ దిద్ది అస్వీరదిస్తున్నారు. ముఖ్యంగా
పేద ప్రజలకు వైద్యం అందుబాటులోనికి తీసుకు రాడానికి కృషిచేస్తామన్నారు.
మెట్టూరు పంచాయతీ ఎమ్మెల్యే సహకారం అభివృద్ధి చేస్తామన్నారు.