BREAKING
కర్నూలు,పాత కంట్రోల్ రూమ్ దగ్గర గల దామోదరం సంజీవయ్య స్మారక ఉన్నత పాఠశాల నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు" కుటుంబాలకు ఆర్థిక భరోసా! ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి అమెజాన్ భూకేటాయింపుపై పెద్దవేడులో నిరసన ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఎన్నికల దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు. ట్రేపాయిల్ కంపెనీ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి హే రామ్.. ఆలయాలను కాపాడండి, ఏపీని రక్షించండి: వైఎస్ జగన్ వినికిడి లోపం..చిన్నారుల చదువుకు అడ్డుకాదు -400 మంది దివ్యాంగ విద్యార్థులకు స్విమ్స్‌లో ఉచిత వినికిడి పరీక్షలు -అవసరమైన వారికి ఉచిత హియరింగ్ ఎయిడ్స్..రోజుకు 20 మందికి పరీక్షలు -చిన్నారుల భవిష్యత్తుకు డా.గుడారు జగదీష్ ప్రత్యేక ప్రాధాన్యత రిసార్ట్స్‌లో పోలీసుల దాడి.. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ మూత్రం దుర్వాసన రావడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణమా.. శరీరం ఇచ్చే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి! 'రామాయణ' భారీ విజయం తర్వాత పుట్టపర్తిలో సాయి పల్లవి సందడి.. భక్తితో భజనలు పాడుతూ ప్రార్థనలు పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం

హే రామ్.. ఆలయాలను కాపాడండి, ఏపీని రక్షించండి: వైఎస్ జగన్

Select Suryaa Now
హే రామ్.. ఆలయాలను కాపాడండి, ఏపీని రక్షించండి: వైఎస్ జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల కూల్చివేత వ్యవహారం మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఆలయాలపై విధ్వంస కాండ కొనసాగుతోందని మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ జగన్.. ‘హే రామ్.. ఆలయాలను కాపాడండి.. ఏపీని రక్షించండి’ అంటూ ట్వీట్ చేశారు.

గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన పలు ఆలయాల తొలగింపు ఉదంతాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తిరుమలలోని చారిత్రక వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత మొదలుకొని, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాలను నేలమట్టం చేయడం, బద్వేలులోని కాశీనాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల దాకా ఇదే తీరు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేసే ధోరణి కొనసాగుతోందని విమర్శించారు. ‘సనాతన ధర్మాన్ని కాపాడటమంటే మీ ప్రభుత్వం నిర్వచించే విధానం ఇదేనా?’ అంటూ సీఎం చంద్రబాబును ఆయన సూటిగా ప్రశ్నించారు.

మరోవైపు, కడప-రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు ఈ ఆలయాన్ని తొలగిస్తుండగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. పల్లవ రాజుల కాలం నాటి ఈ పురాతన ఆలయాన్ని రహదారి అలైన్‌మెంట్ మార్చకుండా కూల్చివేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.