కుటుంబాలకు ఆర్థిక భరోసా!
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 23): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని షాబాద్ మండలం సర్దార్ నగర్ గ్రామంలో ఆదివారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మామిడి కీర్తి హరీష్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కలిసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే పథకం లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.