త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి
తిరుపతి ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: డివిజన్ లో ప్రజలను పట్టిపీడిస్తున్న త్రాగునీటి సమస్యను తన మొదటి ప్రాధాన్యతగా పరిష్కరించడమే తన లక్ష్యమని 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి తెలిపారు. నవంబర్ ఒకటో తేదీ జరిగిన రెండవ సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ మేరకు సోమవారం ఎస్ వి యూనివర్సిటీ శ్రీనివాస్ ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో తను తండ్రితో పాటు కలసి అట్టహాసంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో ప్రధాన సమస్యగా మారిన త్రాగునీటి, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వచ్చిన సమస్య అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకు రైన్ వాటర్ స్టోరేజ్ కి అనుకూలమైన విజయపురం కాలువకు ప్రత్యేక నిధులతో అండర్ గ్రౌండ్ స్టోరేజ్ బ్యాంకు నిర్మిస్తానని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద తాగునీటి ఎద్దడి తీర్చేందుకు ప్రత్యేక స్టోరేజ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ వ్యవస్థపై పూర్తి నిర్లక్ష్యం వహించారని, 2014-19 టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులను తొలగించారని, తన మొదటి ప్రాధాన్యతగా తొలి కౌన్సిల్ సమావేశంలో మేయర్ జేబీ శ్రీనివాస్ సహకారంతో అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు కూటమి నాయకులు ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్