BREAKING
నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య

Select Suryaa Now
సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య

 తిరుపతి ;

డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్య ఇస్తానని 57వ డివిజన్ కార్పొరేటర్ గాలి కావ్య తెలియజేశారు. నవంబర్ ఒకటవ తేదీ జరిగిన రెండవ సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా ఆమె పోటీ చేసి భారీ విజయం అందుకున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకారంలో తన భర్త రాజేష్ తో కలిసి గాలి కావ్య అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కొర్లగుంట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి తనను ఆదరించాలని అభ్యర్థించిన ప్రతి ఓటరు తనకి దైవంతో సమానమని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో తనకు బ్రహ్మరథం పట్టిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నగర మేయర్ జేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన డివిజన్ ను మరింత అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నానని, జరగబోయే మొదటి కౌన్సిల్లో తన డివిజన్ కు సంబంధించిన ప్రజా సమస్యలన్నీ కౌన్సిల్ ముందు ఉంచి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు పలువురు పార్టీ నాయకులు ఆమెను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్