ముడిమ్యాలలో మురిసిన బతుకమ్మలు
అంబరాన్నంటిన సంబురాలు
రంగారెడ్డి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, మహిళలు, యువతులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని పండుగ శోభను తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. మహిళల కోలాహలం, బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ముడిమ్యాల గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని పండుగ విశిష్టతను చాటిచెప్పారు.
పూల పరిమళాలు.. బతుకమ్మ పాటల సందడి.. మహిళల ఆటపాటలతో ముడిమ్యాల గ్రామం సద్దుల బతుకమ్మ వేడుకలతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ముడిమ్యాల సర్పంచ్ గౌడచర్ల శ్రీనివాస్, పీఏసిఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, ఉప సర్పంచ్ జంగారెడ్డి, వార్డు సభ్యులు మల్గని సత్యం, ఉరడి సతీష్, వై. అశోక్, నయీమ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ గోనె శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటిసి సూర్యాపేట శ్రీనివాస్, శేరి రాజు, ఎండి వాజీద్, చాకలి గోపి, విశాల్ రెడ్డి, మల్లప్ప, బీరప్ప, వై. రామచంద్రయ్య, ప్రభాకర్ రెడ్డి, ఊరడి రాములు, ప్రవీణ్, హర్షవర్ధన్, ఎం రాములు, కె. మహేందర్, వై రవీందర్, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.
రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 19) :