BREAKING
మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న! పాల ఉత్పత్తుల తయారీపై గురుకుల విద్యార్థులకు అవగాహన గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్! షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ

మద్యం మత్తులో డ్రైవింగ్రూ -3 వేల జరిమానా - ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్

Select Suryaa Now
మద్యం మత్తులో డ్రైవింగ్రూ -3 వేల జరిమానా - ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్
సూర్య మంచిర్యాల: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి.హన్నన్ హెచ్చరించారు.మంచిర్యాలలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ అనలైజర్ పరీక్షలో 347 రీడింగ్ నమోదైన కుమ్మరి సురేష్‌ను ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసును విచారించిన మంచిర్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్ నిందితుడికి రూ.3 వేల జరిమానా విధించడంతో పాటు, ఒకరోజు పాటు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించారు.అదేవిధంగా అదే రోజు మరో 8 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను విచారించిన న్యాయమూర్తి మొత్తం రూ.17 వేల జరిమానా విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. హన్నన్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు.ఒక్కరి నిర్లక్ష్యం అనేక కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను పర్యవేక్షిస్తూ చిన్ననాటి నుంచే క్రమశిక్షణ,బాధ్యతాయుత ప్రవర్తన అలవాటు చేయాలని కోరారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రజలందరూ సహకరించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.