BREAKING
నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం

కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500...ఆర్జీ-3లో ఐఎన్టీయూసీ పాలాభిషేకం

Select Suryaa Now
కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500...ఆర్జీ-3లో ఐఎన్టీయూసీ పాలాభిషేకం

సూర్య, సెంటినరీ కాలనీ :సింగరేణి సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా నుంచి ఈ ఏడాది కూడా ఒక్కొక్కరికి రూ.5,500 ఆర్థిక ప్రయోజనం అందించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డా. జనక్ ప్రసాద్ చిత్రపటాలకు ఆర్జీ-3 డివిజన్ పరిధిలో ఐఎన్టీయూసీ నాయకులు, కాంట్రాక్టు కార్మికులు పాలాభిషేకం చేశారు. ఐఎన్టీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్జీ-3 డివిజన్ ఇన్‌చార్జి మబ్బు శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం తో చర్చించి కాంట్రాక్టు కార్మికులకు ఆర్థిక ప్రయోజనం అందేలా కృషి చేసిన నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఉడుత శంకర్ యాదవ్, బండ కిరణ్ రెడ్డి, రీజనల్ జనరల్ సెక్రటరీ శ్రీరాముల కుమార్, సెక్యూరిటీ గార్డులు, నర్సరీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.