BREAKING
అయ్యప్పకు ఘనంగా మండల పూజలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ'.. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్ నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం.. వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు రాజ‌ధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం ఈఠా సినిమా కోసం శ్రద్ధా కపూర్ బరువు పెరుగుదల.. వైభవీ మర్చంట్ ఆసక్తికర వ్యాఖ్యలు

చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి

Select Suryaa Now
చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి

హైదరాబాద్, సూర్య ప్రతినిధి: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తమ లక్ష్య సాధనపైనే దృష్టి సారించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర అందరిలోనూ ఎంతో స్ఫూర్తిని నింపిందని అభినందించారు.

తన సినీ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్న చిరంజీవి.. ఆ సమయంలో మద్యం తీసుకోవాలని కొందరు తనకు సూచించారని తెలిపారు. అయితే తాను ఆ అలవాటు జోలికి అస్సలు వెళ్లలేదని, కేవలం తన లక్ష్యం వైపే అడుగులు వేశానని చెప్పారు. నేటి యువత కూడా క్రమశిక్షణతో ముందుకు సాగుతూ, దేశం మరియు కుటుంబం గర్వించేలా అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.