BREAKING
హాకీ ఇండియా లీగ్ 2026–27 జనవరిలో ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం భూముల రి సర్వేకు రైతులు సహకరించాలి...… *హరీశ్ రావు చేతుల మీదుగా టీఆర్ఆర్ఎస్ నాలుగో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ* ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చందర్ రాథోడ్ *మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా* పేదల సొంతింటి కలకు సాకారం.. హరీశ్ రావు వ్యాఖ్యలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఘాటు కౌంటర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కర్రసాము అరంగేట్రం.. తెలంగాణ సంప్రదాయ కళకు జాతీయ గుర్తింపు పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు ఆకాశంలో ఒక తార సినిమాపై కేటీఆర్ ప్రశంసలు.. చాలా కాలం తర్వాత అందమైన చిత్రం చూశానంటూ పోస్ట్ గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -కేజీబీవీ ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్ బి. లక్ష్మి *మైసంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది బస్సు సౌకర్యం కలిపించిన గ్రామ సర్పంచ్ పకిడే సంపత్* *ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా? జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు* జీ5 ఓటీటీలోకి తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఏడు ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ ప్రారంభం ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ లక్ష్యం యువత చేతిలోనే ఉంది: కిషన్‌ రెడ్డి

పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం

Select Suryaa Now
పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం
  • సీనియర్ నేత వాసంశెట్టి సత్యం

కాజులూరు, మేజర్ న్యూస్ :

గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలవాలని కూటమి సీనియర్ నేత వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు.
కాజులూరు మండలం ఆర్యవటంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చందాల వీర వెంకట సత్యనారాయణ (బాబి), వార్డు సభ్యుల గెలుపు కోసం నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి అందించిన విజయాలే పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అభ్యర్థులు ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయవలసిన అవసరం ఉందన్నారు . అనంతరం సర్పంచ్ అభ్యర్థి చందాల బాబి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కూటమి నాయకులు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మెరుగైన మౌలిక సదుపాయాలు అర్హులందరికీ, అందేలా బాధ్యత తీసుకుంటారని, స్పష్టం చేశారు .  తన గుర్తు అయిన కత్తెర ,పై ఓటు వేసి, తనతో పాటు వార్డు సభ్యులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రజలను కోరారు.ఈ ప్రచారంలో కాజులూరు ఎంపీపీ చందాల ఆదినారాయణ, కోట తాతబ్బాయి, డేగల సతీష్, సనపల ధనరాజ్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు , కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.