BREAKING
కృష్ణపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన ఏఎంసి చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ పెట్రోలింగ్‌ పెంచాలి.. ఆస్తి నేరాలకు అడ్డుకట్ట వేయాలి ఫ్రైడే డ్రై డే" కార్యక్రమంలో కార్పొరేటర్ కాకి గంగరాజు ఆదివాసీ పిల్లల్లో సహజ క్రీడా నైపుణ్యాలు : ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అయ్యప్ప స్వాముల నిత్య అన్నదానానికి ఆర్థిక సాయం - రౌతు భాస్కర్, లంక శ్రీను, ఆసిరినాయుడు *శ్రీరాములపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పేదకుటుంబాలకు ఆర్థిక భరోసా – ప్రజాసేవే లక్ష్యం* హాకీ ఇండియా లీగ్ 2026–27 జనవరిలో ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం భూముల రి సర్వేకు రైతులు సహకరించాలి...… *హరీశ్ రావు చేతుల మీదుగా టీఆర్ఆర్ఎస్ నాలుగో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ* ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చందర్ రాథోడ్ *మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా* పేదల సొంతింటి కలకు సాకారం.. హరీశ్ రావు వ్యాఖ్యలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఘాటు కౌంటర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కర్రసాము అరంగేట్రం.. తెలంగాణ సంప్రదాయ కళకు జాతీయ గుర్తింపు

ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత

Select Suryaa Now
ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత

వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆర్డీఓ వాసు చంద్ర అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 442 నుంచి 474 వరకు గల ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రతినిధులకు పంపిణీ చేశారు. జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు లేదా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
వికారాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం 22,934 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 14,855 మంది, మహిళలు 8,079 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించగా, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు అభ్యంతరాలు, సవరణలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 5, 6 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకొని ఓటర్ల జాబితాలో తమ పేర్లు, వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.