BREAKING
నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్'.. ఆకట్టుకుంటోన్న 'అప్సర' లిరికల్ సాంగ్ ఇఫీ 2026 వేదికపై ప్రసార భారతి 'పేజ్ సే పిచ్ తక్' విజేతల ప్రకటన బైరేపల్లిలో బోర్‌వెల్ కేబుల్ వైర్, స్టార్టర్ చోరీ రబీ పంట కాలంలో అపరాల పైర్లలో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం ఐఐటీ అబుదాబి తొలి బ్యాచ్ గ్రాడ్యుయేట్లను కలిసిన అబుదాబి యువరాజు విద్యుత్ షాక్ తో పాడి ఆవు మృతి డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా; అడుగుపెడితే అరెస్ట్ చేస్తామన్న ప్రభుత్వం కూతురి కోసం తండ్రి పోరాటం.. ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ 'నాన్న కుట్టి' ట్రైలర్ ఇంజినీరింగ్ రంగంలో ఏఐ సాధనాలపై అవగాహన అవసరం.. జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు రిగ్గింగ్ చేసినా.. ఓడిపోయిన చరిత్ర మీది మీడియాతో నగర మేయర్ సి.రమేష్ గౌడ్ పంచమహాశక్తుల నేపథ్యంలో 'ఆది రుద్రాక్ష'.. తొలి గ్లింప్స్ విడుదల చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు విక్టోరియన్ మార్కెట్ భవనంలో కొత్త లండన్ మ్యూజియం

చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ

Select Suryaa Now
చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ

సూర్య కమ్మర్ పల్లి : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభకు కమ్మర్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు,బహుజనవాదులు, రాజ్యాంగ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా ఈ మహాసభలో హైకోర్టు న్యాయవాది, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు డా. కదిరే కృష్ణ రచించిన “అద్వితీయ నాయకుడు డా.బి.ఆర్.అంబేద్కర్” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం వంటి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ మహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్ నిమ్మ రాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యులు లెక్చరర్ సాయన్న, ఆవుల రాజేశ్వర్, వినయ్, మహేష్, భారత్, అరవింద్, రమంజి, డా. గంగాధర్, శంకర్, బుచ్చయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.