BREAKING
నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్'.. ఆకట్టుకుంటోన్న 'అప్సర' లిరికల్ సాంగ్ ఇఫీ 2026 వేదికపై ప్రసార భారతి 'పేజ్ సే పిచ్ తక్' విజేతల ప్రకటన బైరేపల్లిలో బోర్‌వెల్ కేబుల్ వైర్, స్టార్టర్ చోరీ రబీ పంట కాలంలో అపరాల పైర్లలో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం ఐఐటీ అబుదాబి తొలి బ్యాచ్ గ్రాడ్యుయేట్లను కలిసిన అబుదాబి యువరాజు విద్యుత్ షాక్ తో పాడి ఆవు మృతి డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా; అడుగుపెడితే అరెస్ట్ చేస్తామన్న ప్రభుత్వం కూతురి కోసం తండ్రి పోరాటం.. ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ 'నాన్న కుట్టి' ట్రైలర్ ఇంజినీరింగ్ రంగంలో ఏఐ సాధనాలపై అవగాహన అవసరం.. జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు రిగ్గింగ్ చేసినా.. ఓడిపోయిన చరిత్ర మీది మీడియాతో నగర మేయర్ సి.రమేష్ గౌడ్ పంచమహాశక్తుల నేపథ్యంలో 'ఆది రుద్రాక్ష'.. తొలి గ్లింప్స్ విడుదల చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు విక్టోరియన్ మార్కెట్ భవనంలో కొత్త లండన్ మ్యూజియం

క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు

Select Suryaa Now
క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం..  దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు సాధించింది. తాజాగా ప్రకటించిన 2027 ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించింది. దక్షిణాసియా స్థాయిలో 354వ స్థానాన్ని, ఆసియా స్థాయిలో 1101–1200 స్థానాల విభాగంలో చోటు దక్కించుకుంది.
విద్యా ప్రమాణాలు, పరిశోధనల నాణ్యత, అధ్యాపకులు–విద్యార్థుల నిష్పత్తి, అంతర్జాతీయ సహకారం వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గుర్తింపు పొందిన ఏడు విశ్వవిద్యాలయాల్లో ఎస్కేయూ ఒకటిగా నిలవడం విశేషం.
ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్. జ్యోతి కుమార్, పాలక మండలి సభ్యులు, రిజిస్ట్రార్ డా. ఇ. రమేష్ బాబు, ర్యాంకింగ్స్ సమన్వయకర్త ప్రొఫెసర్ చిట్టా సురేష్ అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులను అభినందించారు.
ఈ గుర్తింపు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రోత్సాహమని, బోధన, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని ఉపకులపతి తెలిపారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..