కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి
డోన్ రూరల్, మేజర్ న్యూస్:నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కమలాపురం గ్రామ సర్పంచ్ పదవిని వైకాపా ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. తెదేపా జడ్పీటీసీ సభ్యురాలు వేదవతి స్వగ్రామమైన కమలాపురంలో సర్పంచ్ స్థానానికి వైకాపా నాయకులు బుగ్గన జయచంద్రారెడ్డి సతీమణి బుగ్గన జయలక్ష్మి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనికి సంబంధించి అధికారులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సమీప బంధువైన జయచంద్రారెడ్డి ప్రస్తుతం వైకాపా మండల యువజన విభాగం అధ్యక్షుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు