ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్
- అభ్యర్థుల విజయంపై కన్నబాబు ధీమా
కాకినాడ, మేజర్ న్యూస్ : కాకినాడ కార్పొరేషన్‌కు ఈ నెల 26న గురువారం నాడు జరుగుతున్న ఎన్నికలలో వైయస్సార్సీపి పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారని అందరూ తప్పక విజయం సాధిస్తారని ముఖ్యంగా మేయర్ స్థానానికి పోటీ చేస్తున్న కాదా సత్యశ్రీ అభ్యర్థి కూడా అఖండ మెజార్టీతోవిజయం సాధిస్తారని మాజీ మంత్రి కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ డివిజన్లో మాజీ మంత్రి బోస్ తో కలిసిపార్టీ మేయర్ అభ్యర్థి కాదా సత్యశ్రీ, డివిజన్ అభ్యర్ది వడ్డీ మణికుమార్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సామాన్యుల ప్రజల పాలిట అధిక భారాన్ని మోపుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పేదల అభ్యున్నతికి వైయస్సార్సీపి పార్టీ అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గత పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చేసి చూపించారని నేటికీ ప్రజలు వాటిని మర్చిపోలేదని అన్నారు. ప్రజాసేవలో సేవలో మణికుమార్ ఎల్లప్పుడూ ముందుంటున్నారని, ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తే డివిజన్ సమస్యలు పరిష్కరించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతారు అన్న నమ్మకం తనకుందని కురసాల కన్నబాబు అన్నారు.
వైయస్సార్సీపి పార్టీ అభ్యర్థి వడ్డీ మణికుమార్ మాట్లాడుతూ గతంలో తాను ఇదే వార్డుకు కార్పొరేటర్‌గా బాధ్యతలు నిర్వహించానని, ఆ సమయంలో 14 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేసి ప్రజా అవసరాలను తీర్చానని చెప్పారు. గతంలో తాను కార్పొరేటర్‌గా బాధ్యతలు నిర్వహించిన కేవలం 9 మాసాల సమయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నానని డివిజన్ పరిధిలోనే తన నివాసం కూడా ఉందన్నారు. తాను విజయం సాధిస్తే ఏడు పనులు పూర్తి చేసి చూపిస్తానని వాగ్దానాలతో కూడిన ప్రోగ్రస్ రిపోర్టుతో పోందుపర్చిన మేనిఫెస్టోను ఓటర్లకు అందజేశారు.
మణికుమార్ వెంట అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.