ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం
అనంతపురం విద్య మేజర్ న్యూస్:- అనంతపురం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో కళాశాల వైస్ చైర్మన్ సి. చక్రధర్ రెడ్డి ఆదేశాలమేరకు ఎన్.ఎస్.ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో, మానవతా ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ సి. చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆరోగ్యపరంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 128 మంది రక్తదానం చేశారు. శిబిరంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్.ఏ.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డా. టి. శ్రీనివాసులు, ఏవో .ఎ.శ్రీనాథ్ , మానవతా ట్రస్ట్ సభ్యులు సలీం,రమణారెడ్డి,డాక్టర్లు ఎన్.ఎస్.ఎస్ పిఓలు జి.ఆనంద్ బాబు,టి.సుదర్శన్ రెడ్డి,వాలంటీర్లు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..