BREAKING
నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్'.. ఆకట్టుకుంటోన్న 'అప్సర' లిరికల్ సాంగ్ ఇఫీ 2026 వేదికపై ప్రసార భారతి 'పేజ్ సే పిచ్ తక్' విజేతల ప్రకటన బైరేపల్లిలో బోర్‌వెల్ కేబుల్ వైర్, స్టార్టర్ చోరీ రబీ పంట కాలంలో అపరాల పైర్లలో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం ఐఐటీ అబుదాబి తొలి బ్యాచ్ గ్రాడ్యుయేట్లను కలిసిన అబుదాబి యువరాజు విద్యుత్ షాక్ తో పాడి ఆవు మృతి డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా; అడుగుపెడితే అరెస్ట్ చేస్తామన్న ప్రభుత్వం కూతురి కోసం తండ్రి పోరాటం.. ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ 'నాన్న కుట్టి' ట్రైలర్ ఇంజినీరింగ్ రంగంలో ఏఐ సాధనాలపై అవగాహన అవసరం.. జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు రిగ్గింగ్ చేసినా.. ఓడిపోయిన చరిత్ర మీది మీడియాతో నగర మేయర్ సి.రమేష్ గౌడ్ పంచమహాశక్తుల నేపథ్యంలో 'ఆది రుద్రాక్ష'.. తొలి గ్లింప్స్ విడుదల చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు విక్టోరియన్ మార్కెట్ భవనంలో కొత్త లండన్ మ్యూజియం

లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య

Select Suryaa Now
లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత భావోద్వేగాలు, జీవిత దృక్పథానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. సాధారణంగా మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్ల రూపంలో బయటకు వ్యక్తం చేస్తుంటారు కానీ, తనకు ఎంత బాధ కలిగినా ఏడవాలని అనిపిస్తుందే తప్ప కన్నీళ్లు మాత్రం రావని నాగచైతన్య వెల్లడించారు. అలా లోలోపల కలిగే బాధను బయటకు చెప్పలేక ఎంతో ఇబ్బంది పడుతుంటానని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ అడ్వెంచర్ ట్రిప్‌లో భాగంగా యూట్యూబర్ జాస్తితో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన సందర్భంగా నాగచైతన్య ఈ వ్యాఖ్యలు చేశారు.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వృషకర్మ ప్రమోషన్లలో భాగంగా ఈ ప్రత్యేక ప్రయాణం జరిగింది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లను వినూత్నంగా ప్రారంభించిన చిత్ర బృందం, నాగచైతన్యతో కలిసి రామగిరి ఫోర్ట్‌పైకి ట్రెక్కింగ్ నిర్వహించింది. దాదాపు రోజంతా అక్కడే గడుపుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిన ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య పలు సరదా ముచ్చట్లతో పాటు లోతైన చర్చలు చోటుచేసుకున్నాయి.

ఈ సందర్భంగా జీవితాన్ని చూసే విధానంపై స్పందించిన నాగచైతన్య, జీవితంలో ఎలాంటి పరిమితులు లేదా సౌకర్యాలు ముందుగానే నిర్ణయించుకోకుండా ఎదురయ్యే పరిస్థితులను, అనుభవాలను స్వీకరించడమే అసలైన జీవితమని అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్భాల్లో ఏడవాలని అనిపించినా కన్నీళ్లు రావని, కానీ లోలోపల మాత్రం ఎంతో బాధగా ఉంటుందని ఆయన చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అడ్వెంచర్ ట్రిప్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేయగా, పూర్తి వీడియోను నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

నాగచైతన్య వ్యక్తిత్వంలోని మరో సున్నితమైన కోణాన్ని ఈ ప్రోమో ఆవిష్కరిస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవైపు వృషకర్మ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా, మరోవైపు ట్రెక్కింగ్ వీడియోలో ఆయన పంచుకున్న భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.