'ఇట్లు అర్జున' నుంచి యూత్‌ఫుల్ వీడియో సాంగ్.. 'హాయ్ రే' పాట విడుదల
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఇట్లు అర్జున చిత్రం నుంచి హాయ్ రే అంటూ సాగే యూత్‌ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రముఖ నిర్మాత ఏ. మహేశ్వర రెడ్డి కుమారుడు అనీష్ కథానాయకుడిగా పరిచయమైన ఈ సినిమాలో అనస్వర రాజన్ కథానాయికగా నటించారు. మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్టుకు అక్కినేని నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించగా, వెంకీ కుడుముల నిర్మించారు.
ఇటీవల థియేటర్లలో విడుదలైన ఇట్లు అర్జున సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. సినిమాకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగం పెంచిన మేకర్స్, ఇప్పుడు ఈ హాయ్ రే వీడియో సాంగ్‌ను విడుదల చేయడం యువతను మరింతగా ఆకట్టుకుంటోంది.
యువతను ఉర్రూతలూగించే బీట్స్, ఆకర్షణీయమైన విజువల్స్‌తో రూపొందిన ఈ పాట సోషల్ మీడియాలో మంచి స్పందన రాబట్టుకుంటోంది. కొత్త జంట అనీష్, అనస్వర రాజన్‌ల కెమిస్ట్రీ ఈ గీతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అనీష్ హీరోగా తొలి చిత్రంతోనే ఆకట్టుకోగా, వెంకీ కుడుముల నిర్మాణ విలువలు, మహేష్ ఉప్పల దర్శకత్వ శైలి సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. తాజాగా విడుదలైన హాయ్ రే వీడియో సాంగ్‌తో ఇట్లు అర్జున పాటలు, సన్నివేశాలపై ప్రేక్షకుల్లో మరోసారి చర్చ మొదలైంది.