BREAKING
నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్'.. ఆకట్టుకుంటోన్న 'అప్సర' లిరికల్ సాంగ్ ఇఫీ 2026 వేదికపై ప్రసార భారతి 'పేజ్ సే పిచ్ తక్' విజేతల ప్రకటన బైరేపల్లిలో బోర్‌వెల్ కేబుల్ వైర్, స్టార్టర్ చోరీ రబీ పంట కాలంలో అపరాల పైర్లలో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం ఐఐటీ అబుదాబి తొలి బ్యాచ్ గ్రాడ్యుయేట్లను కలిసిన అబుదాబి యువరాజు విద్యుత్ షాక్ తో పాడి ఆవు మృతి డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా; అడుగుపెడితే అరెస్ట్ చేస్తామన్న ప్రభుత్వం కూతురి కోసం తండ్రి పోరాటం.. ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ 'నాన్న కుట్టి' ట్రైలర్ ఇంజినీరింగ్ రంగంలో ఏఐ సాధనాలపై అవగాహన అవసరం.. జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు రిగ్గింగ్ చేసినా.. ఓడిపోయిన చరిత్ర మీది మీడియాతో నగర మేయర్ సి.రమేష్ గౌడ్ పంచమహాశక్తుల నేపథ్యంలో 'ఆది రుద్రాక్ష'.. తొలి గ్లింప్స్ విడుదల చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు విక్టోరియన్ మార్కెట్ భవనంలో కొత్త లండన్ మ్యూజియం

ఇంజినీరింగ్ రంగంలో ఏఐ సాధనాలపై అవగాహన అవసరం.. జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు

Select Suryaa Now
ఇంజినీరింగ్ రంగంలో ఏఐ సాధనాలపై అవగాహన అవసరం..  జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అధ్యాపకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు సూచించారు.
జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించే కృత్రిమ మేధస్సు సాధనాలపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు విద్యాబోధన, పరిశోధన, ఇంజినీరింగ్ రంగాల్లో కీలక మార్పులకు దోహదపడుతోందన్నారు. అధ్యాపకులు నూతన పరిజ్ఞానాన్ని నేర్చుకొని బోధనలో వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఇన్‌ఛార్జి ఆచార్య బి. దుర్గాప్రసాద్, కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య పి. చెన్నారెడ్డి, ఉపప్రధానాచార్యులు ఆచార్య బి. దిలీప్ కుమార్, కార్యక్రమ సంచాలకురాలు ఆచార్య పి. సుజాత, విభాగాధిపతి ఆచార్య ఆర్. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 24 నుంచి 28 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అధ్యాపకులకు కృత్రిమ మేధస్సు సాధనాల వినియోగం, బోధన, పరిశోధనలో వాటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించనున్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్