బైరేపల్లిలో బోర్వెల్ కేబుల్ వైర్, స్టార్టర్ చోరీ
గుడిబండ మండల పరిధిలోని బైరేపల్లి గ్రామంలో రైతు దేవరాజు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. బోర్వెల్కు సంబంధించిన సుమారు 50 మీటర్ల విద్యుత్ కేబుల్ వైర్‌ను కత్తిరించి తీసుకెళ్లడంతో పాటు స్టార్టర్‌ను కూడా దొంగిలించారు.
ఈ ఘటనపై బాధిత రైతు దేవరాజు గుడిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు దేవరాజు మాట్లాడుతూ.. దొంగతనం కారణంగా తమకు ఆర్థిక నష్టం వాటిల్లిందని, వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చోరీకి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను తక్షణమే గుర్తించి, వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పొలాల వద్ద ఇలాంటి చోరీలు జరగకుండా పోలీసులు నిఘా పెంచాలని రైతులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.