BREAKING
ఉక్రెయిన్ యుద్ధం, ఆయుధ సహాయంపై జర్మనీ పౌరుల వైఖరిలో కీలక మార్పు.. ఉత్సాహంగా ఎస్కేయూ అంతర్ కళాశాలల పురుషుల క్రికెట్ టోర్నీ రెండో రోజు పోటీలు కోదాడలో భారీ వర్షం. బంగ్లాదేశ్‌లో వేతనాల పెంపు కోసం భగ్గుమన్న గార్మెంట్ కార్మికుల ఆందోళన: ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు బంద్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు చేజారడంపై వీర్ దాస్ ఆవేదన.. జెట్‌ల్యాగ్‌తో వేడుకకు హాజరు క్రీడా పోటీల్లో ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ ​ఖాకీ చొక్కా మాటున రాజకీయం? ​సబ్-హెడ్డింగ్: ​మల్యాల సర్పంచ్ ఎన్నికల్లో కానిస్టేబుల్ జోక్యంపై వివాదం ​సోదరుడి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ​విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీకి గ్రామస్థుల విజ్ఞప్తి నెరణికి సర్పంచ్ అభ్యర్థి రాంపురం బసమ్మను గెలిపించండి ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించే క్రమంలో రాజకీయ పార్టీలు సహకారం అందించాలి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మళ్లీ నష్టాలు: కబ్జాను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కృత్రిమ మేధ దిగ్గజం ఆంథ్రోపిక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వాల్ స్ట్రీట్‌లో ఎన్విడియా షేర్లకు మళ్లీ సెగ డాలర్ జోరుకు తాత్కాలిక బ్రేక్..

నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం చిట్టమూరు,కోగిలి,పెళ్లకూరు, మొలకలపూడి

Select Suryaa Now
నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం  చిట్టమూరు,కోగిలి,పెళ్లకూరు, మొలకలపూడి

చిట్టమూరు మేజర్ న్యూస్

చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నాలుగు గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చిట్టమూరు, కోగిలి,పెళ్లకూరు, మొలకలపూడి గ్రామ పంచాయతీల సర్పంచులుగా గణపర్తి సుశీలమ్మ,షేక్ రషీద్, ఏలూరు కస్తూరయ్య,ఈగ రామయ్యలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా,చిట్టమూరు పంచాయతీ వైస్ సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా చిట్టమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల పార్టీ కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు,వైస్ సర్పంచ్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్,ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ గ్రామ ప్రజలకు, ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించిన వివిధ పార్టీల నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు చూపిన ఐకమత్యం, రాజకీయ పార్టీల నాయకుల మధ్య నెలకొన్న సమన్వయం అభినందనీయమని పేర్కొంటూ,ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు,వైస్ సర్పంచ్‌కు అభినందనలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో రాజకీయ విభేదాలకు తావులేకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పంచాయతీల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించిన చిట్టమూరు, కొగిలి,పెళ్లకూరు, మొలకలపూడి గ్రామాల ప్రజలకు,వివిధ పార్టీల నాయకులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్