BREAKING
ఉక్రెయిన్ యుద్ధం, ఆయుధ సహాయంపై జర్మనీ పౌరుల వైఖరిలో కీలక మార్పు.. ఉత్సాహంగా ఎస్కేయూ అంతర్ కళాశాలల పురుషుల క్రికెట్ టోర్నీ రెండో రోజు పోటీలు కోదాడలో భారీ వర్షం. బంగ్లాదేశ్‌లో వేతనాల పెంపు కోసం భగ్గుమన్న గార్మెంట్ కార్మికుల ఆందోళన: ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు బంద్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు చేజారడంపై వీర్ దాస్ ఆవేదన.. జెట్‌ల్యాగ్‌తో వేడుకకు హాజరు క్రీడా పోటీల్లో ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ ​ఖాకీ చొక్కా మాటున రాజకీయం? ​సబ్-హెడ్డింగ్: ​మల్యాల సర్పంచ్ ఎన్నికల్లో కానిస్టేబుల్ జోక్యంపై వివాదం ​సోదరుడి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ​విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీకి గ్రామస్థుల విజ్ఞప్తి నెరణికి సర్పంచ్ అభ్యర్థి రాంపురం బసమ్మను గెలిపించండి ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించే క్రమంలో రాజకీయ పార్టీలు సహకారం అందించాలి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మళ్లీ నష్టాలు: కబ్జాను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కృత్రిమ మేధ దిగ్గజం ఆంథ్రోపిక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వాల్ స్ట్రీట్‌లో ఎన్విడియా షేర్లకు మళ్లీ సెగ డాలర్ జోరుకు తాత్కాలిక బ్రేక్..

అద్దంకి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు.. పట్టణ సమస్యల పరిష్కారానికి వినతులు.

Select Suryaa Now
అద్దంకి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు..  పట్టణ సమస్యల పరిష్కారానికి వినతులు.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాకాని అశోక్, వైస్ చైర్మన్‌ రంగిశెట్టి సాంబశివరావు ప్రజాసంఘాలు, రోటరీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. సుమారు 55 వేలకు పైగా జనాభా కలిగిన ప్రాచీన, చారిత్రక నేపథ్యం ఉన్న అద్దంకి పట్టణం అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలోనూ ముందుండాలని ఆకాంక్షించారు. పట్టణంలో ప్రజలు సాయంత్రం వేళ సేదతీరేందుకు అనువైన పార్కులు లేవని, పార్కు ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. డైవర్షన్ పనులను త్వరగా పూర్తి చేసి సింగరకొండ వైపు మళ్లిస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని, ఇది నూతన పాలకవర్గ హయాంలో జరగాలని ఆకాంక్షించారు. ప్రతి వార్డు తిరిగి ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు