BREAKING
వాల్ స్ట్రీట్‌లో ఎన్విడియా షేర్లకు మళ్లీ సెగ డాలర్ జోరుకు తాత్కాలిక బ్రేక్.. నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం చిట్టమూరు,కోగిలి,పెళ్లకూరు, మొలకలపూడి 'ఆకాశంలో ఒక తార' సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ.. సెకండాఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు అద్దంకి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు.. పట్టణ సమస్యల పరిష్కారానికి వినతులు. మిట్స్‌లో ఘనంగా ఐఈఈఈ అనంతపురం జోనల్ కాంగ్రెస్-2026 : మహిళా సాధికారత,నాయకత్వ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన ఎన్డీఏ కూటమిలోకి తిరిగి శిరోమణి అకాలీదళ్‌; స్వాగతించిన ప్రధాని మోదీ సీఎం సభ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఎరుకుల తిప్పేస్వామి విస్తృతంగా ప్రచారం ముగిసిన ప్రచార పర్వం తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం : సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : ఈనెల 26న (గురువారం) బి.కొత్తకోట మున్సిపాలిటీ,సంబేపల్లి 9,రామాపురం 2 పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కున వార్షిక ఆదాయ అంచనాలను భారీగా పెంచిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం 'బెస్ట్ బై' : మొదటి దశ పంచాయతీ, బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముగింపు 'అశ్విన్స్' దర్శకుడితో శ్రుతి హాసన్ కొత్త తమిళ చిత్రం.. ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ ఓటుహక్కుపై యువతలో చైతన్యం రావాలి : విశ్వం డిగ్రీ కళాశాలలో స్వీప్ అవగాహన కార్యక్రమం : వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న 44 మంది విద్యార్థులు : మండల స్థాయి పోటీలకు 10 మంది ఎంపిక యూబీఎస్‌పై కఠిన మూలధన నిబంధనలకు స్విస్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం

ఎన్. కొంతలపాడు సర్పంచ్‌గా మందా వరలక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక!

Select Suryaa Now
ఎన్. కొంతలపాడు సర్పంచ్‌గా మందా వరలక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక!

ఎన్. కొంతలపాడు సర్పంచ్‌గా మందా వరలక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక!

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు మండల పరిధిలోని ఎన్. కొంతలపాడు గ్రామ సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన అభ్యర్థి మందా వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలోని వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ.. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సహకారంతో గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికలు సాధ్యమయ్యాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఆమె అందిస్తున్న సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం మందా వరలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని, గ్రామస్థులందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. గ్రామంలోని దేవాలయాల అభివృద్ధికి రూ.10 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు శ్రీనివాసులు, హరినాయుడు తదితరులు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.