BREAKING
సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి బెస్తరపల్లిలో గడ్డివాని దగ్ధం.. 5 లక్షల వరకు ఆస్తి నష్టం. 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు భారత్ బయో ఎకానమీ నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు భారత్ 2.5 మిలియన్ డాలర్ల సాయం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా శ్రీలంక పార్లమెంట్ నేపాల్ వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయుల మరణ ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం ఏరో ఇండియా 2027కు రికార్డు స్థాయిలో స్పందన ఎంఎస్ఎంఈ నమోదులలో 10 కోట్ల మైలురాయి ఆటోమొబైల్ రంగం పీఎల్ఐ పథకం కింద రూ.4,385 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ.. యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి

ఓటుహక్కుపై యువతలో చైతన్యం రావాలి : విశ్వం డిగ్రీ కళాశాలలో స్వీప్ అవగాహన కార్యక్రమం : వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న 44 మంది విద్యార్థులు : మండల స్థాయి పోటీలకు 10 మంది ఎంపిక

Select Suryaa Now
ఓటుహక్కుపై యువతలో చైతన్యం రావాలి : విశ్వం డిగ్రీ కళాశాలలో స్వీప్ అవగాహన కార్యక్రమం : వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న 44 మంది విద్యార్థులు : మండల స్థాయి పోటీలకు 10 మంది ఎంపిక

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుహక్కు అత్యంత కీలకమని,అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు అధికారులు సూచించారు.భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా కురబలకోట మండలంలోని విశ్వం డిగ్రీ కళాశాలలో మంగళవారం ఓటరు అవగాహన కార్యక్రమంతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురబలకోట తహసీల్దార్ ధనుంజయులు,మండల విద్యాశాఖాధికారి ద్వారకానాథ్ రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.రఘునాథ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని,ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతోపాటు సమాజంలోని ఇతరులకు కూడా ఓటుహక్కు ప్రాధాన్యతను వివరించాలని సూచించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా ఓటువేయాలని తహసీల్దార్ ధనంజయులు పేర్కొన్నారు.అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 44 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.వీరిలో ప్రతిభ కనబరిచిన పదిమందిని మండల స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.వీరు తదుపరి తాలూకా,జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయడంతోపాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా విశ్వం విద్యాసంస్థల చైర్మన్ మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ సి.రఘునాథరెడ్డి,తహసీల్దార్ ధనంజయులు,ఎంఈఓ ద్వారకానాథ్ రెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.రానున్న ఉన్నతస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,వివిధ విభాగాల హెచ్‌ఓడీలు,బోధన,బోధనేతర సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి