BREAKING
సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి బెస్తరపల్లిలో గడ్డివాని దగ్ధం.. 5 లక్షల వరకు ఆస్తి నష్టం. 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు భారత్ బయో ఎకానమీ నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు భారత్ 2.5 మిలియన్ డాలర్ల సాయం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా శ్రీలంక పార్లమెంట్ నేపాల్ వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయుల మరణ ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం ఏరో ఇండియా 2027కు రికార్డు స్థాయిలో స్పందన ఎంఎస్ఎంఈ నమోదులలో 10 కోట్ల మైలురాయి ఆటోమొబైల్ రంగం పీఎల్ఐ పథకం కింద రూ.4,385 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ.. యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి

​కౌన్సిలర్‌గా ప్రమాణం చేసిన పచ్చిపాల రామకృష్ణ ఆచారి : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు

Select Suryaa Now
​కౌన్సిలర్‌గా ప్రమాణం చేసిన పచ్చిపాల రామకృష్ణ ఆచారి : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు

మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్‌గా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి విధితమే.ఈ నేపథ్యంలో సోమవారం వైభవంగా జరిగిన నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా 28వ వార్డు కౌన్సిలరుగా ఆయన ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి సతీమణి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసితో కలిసి హాజరయ్యారు.వరుసగా నాలుగోసారి కౌన్సిలరుగా బాధ్యతలు చేపట్టిన తులసి రామకృష్ణ దంపతులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా,ఛైర్మన్ శ్రీరామ్ చినబాబులను పూలమాల,శాలువాలతో ఘనంగా సన్మానించారు.వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు సహాయ,సహకారాలతో అభివృద్ధిలో 28వ వార్డును అగ్ర పథంలో నిలుపుతామని స్పష్టం చేశారు.తమ కుటుంబాన్ని దశాబ్దాలుగా ఆదరిస్తున్న వార్డు ప్రజలకు,టిడిపి నాయకులు,కార్యకర్తలకు రుణపడి ఉంటామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి వార్డు ప్రజలు,సీనియర్ నాయకులు,శ్రేయోభిలాషులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంఛార్జి