BREAKING
లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు విక్టోరియన్ మార్కెట్ భవనంలో కొత్త లండన్ మ్యూజియం నెట్‌ఫ్లిక్స్‌లో సీబీబీస్ కార్యక్రమాల ప్రయోగాత్మక ప్రసారం 'ఇట్లు అర్జున' నుంచి యూత్‌ఫుల్ వీడియో సాంగ్.. 'హాయ్ రే' పాట విడుదల దశాబ్దాల కల సాకారం.. ప్రగతి పథంలో గ్రామసీమలు! సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్

దశాబ్దాల కల సాకారం.. ప్రగతి పథంలో గ్రామసీమలు!

Select Suryaa Now
దశాబ్దాల కల సాకారం.. ప్రగతి పథంలో గ్రామసీమలు!

— రూ. 4 కోట్ల నిధులతో అయీనాపూర్ – సుగూర్ లింగంపల్లి ఆర్ అండ్ బీ రహదారి


— మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో మంజూరైన నిధులు


కృష్ణ సూర్య న్యూస్ :
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి సరైన రహదారి సౌకర్యం లేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రజల చిరకాల వాంఛకు పరిష్కారం చూపుతూ అయీనాపూర్ గ్రామం నుండి సుగూర్ లింగంపల్లి గ్రామం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆర్ అండ్ బీ రహదారి పనులకు మంగళవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు, సోదరుడు శేషగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజప్ప గౌడ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో   భూమిపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ నిర్మాణ పనులను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రహదారి సమస్యకు నేడు శాశ్వత పరిష్కారం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయితే ఇరు గ్రామాల మధ్య అనుసంధానం పెరగడమే కాకుండా, ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల చదువులకు, అత్యవసర వైద్య సేవలకు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించుకోవడానికి మరియు వ్యాపార కార్యకలాపాలకు ఈ రహదారి ఎంతో ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి, తక్షణమే స్పందించి రూ. 4 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించిన ప్రియతమ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి కి గ్రామ ప్రజలు మరియు కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి సోదరుడు శేషగిరి ని మండల నాయకులు, గ్రామ సర్పంచ్, పెద్దలు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అయీనాపూర్ సర్పంచ్ శరణ్య స్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజప్ప గౌడ, ఉపాధ్యక్షులు నారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, పల్లె సురేష్, కృష్ణ సర్పంచ్ నాగేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగప్ప, నాగేశ్వరరావు, నాగేందర్, తమ్మప్ప, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నాగప్ప, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాగ్లి మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం