telangana
యువత క్రీడాల్లో రాణించాలి
సూర్యకోనరావుపేట : యువత క్రీడాల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఉపసర్పంచ్ కాసర్ల పవిత్రసురేష్ అకాంక్షించారు. మామిడిపల్లి గ్రామంలోని క్రీడాకారులకు తన స్వంత ఖర్చులతో క్రీడా దుస్తులను అందజేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా దుస్తులను అందజేసినట్లు తెలిపారు. అలాగే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్రీడా దస్తులను మామిడిపల్లి వీబీఏ క్రీడ జట్టు సభ్యులు అందజేశారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కొడిమ్యాల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీకాంత్, మైకేల్, తదితరులు ఉన్నారు.