telangana
కన్నుల పండవగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
సూర్య చందుర్తి :చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలోని శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయం 9 గంటలకు స్వామివారికి అభిషేకం, 11.35 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా, వేములవాడ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ చేన్నమనేని వికాస్ రావు,బి ఆర్ ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట,సర్పంచ్ పోతరాజు భారతి- నగేష్, ఉప సర్పంచ్ బాసూజీ వేణు,వివిధ పార్టీల నాయకులు,,గొట్టే ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, చింతపంటి,రామస్వామి, దుమ్మ అంజయ్య, తిప్పని శ్రీనివాస్,బొడ్డు శంకర్, తిప్పనినరసయ్య ,రామన్నపేట, తిమ్మపూర్, మర్రిగడ్డ, నర్సింగాపూర్, మల్యాల, తదితర గ్రామాల ప్రజలు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.