BREAKING
నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు భేష్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎమ్మెల్యే మదన్ మోహన్  కలిసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన చంద్రశేఖర్ 2027 అంచనాలు పెంచినా లాభాల మార్జిన్ ఆందోళనలతో హెచ్‌పీఈ షేర్లు పతనం గ్యాస్ ఐరన్ బాక్సులు పంపిణీ అవకాశం ఇవ్వండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా! వైకాపా సర్పంచి అభ్యర్థి రంగనాయకులు విజ్ఞప్తి స్పాటిఫై సేవల్లో తీవ్ర అంతరాయం ఏఐ గాడ్జెట్ అప్‌గ్రేడ్ జోరుతో బెస్ట్ బై వార్షిక అంచనాలు పెంపు రమణీయం… రథోత్సవం…గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం అమెరికా వాణిజ్య బ్లాక్‌లిస్ట్‌లో ఎన్‌విడియా కస్టమర్ మెగాస్పీడ్ లిబియా జలాల్లో రష్యా నౌకలపై దాడి ఆత్మరక్షణ చర్యే జిల్లా అండర్‌–19 బాలబాలికల క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు.. ఈ నెల 26న అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఎంపికలు.. ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం గ్రామ అభివృద్ధే లక్ష్యం..అవకాశం ఇవ్వండి! అమెరికాలోని వాషింగ్టన్‌లో మూడు బర్డ్ ఫ్లూ కేసులు, ఒక మరణం ఎమ్మెల్యే జూలకంటి నమ్మకానికి నీరాజనం. మురుగునీరుతో ఇబ్బంది పడుతున్నాం

నగర పాలక సంస్థలోని విభాగాలను సందర్శించిన నగర మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడి

Select Suryaa Now
నగర పాలక సంస్థలోని విభాగాలను సందర్శించిన నగర మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడి

గుంటూరు : గుంటూరు నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నగర మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడి నగర పాలకసంస్థ అధికారులకు సూచించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని రెవిన్యూ విభాగం, సి సెక్షన్, రికార్డు రూమ్, ఉపాసెల్, పట్టణ ప్రణాళిక తదితర విభాగాలను నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత మేయర్ నగర పాలక సంస్థలోని వివిధ విభాగాలను అధికారులతో కలిసి పరిశీలించి, అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, నిర్దేశిత సమయానికి విధులకు హాజరుకావా లన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, ముఖ్యంగా త్రాగు నీరు, పారిశుధ్యం, వీధి దీపాల పై వచ్చే పిర్యాదులను వెంటనే పరిష్కరించి, నాణ్యమైన సేవలను అందించాలన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తు, అభివృద్ధి పనులు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ బి. శ్రీనివాసరావు, యస్.ఈ జి. వెంకటేశ్వర రావు, మేనేజర్ బాలాజీ బాష, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

 

సూర్య నాయక్