ఎమ్మెల్యే జూలకంటి నమ్మకానికి నీరాజనం.
దుర్గి మండల పరిషత్ అధ్యక్షురాలిగా యాగంటి నాగలక్ష్మిని నియమించడంతో మండల రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు తెరలేచింది.మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనపై ఉంచిన నమ్మకంతోఈ బాధ్యతను అప్పగించడంపై యాగంటి నాగలక్ష్మి, నరేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ యాగంటి నరేష్ పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా యాగంటి నరేష్ మాట్లాడుతూ. తమపై నమ్మకం ఉంచి దుర్గి మండల ఎంపీపీ బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం తమకు అప్పగించిన బాధ్యతను గౌరవంగా భావిస్తున్నామని, ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువగా ఉండి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ముఖ్యంగా దుర్గి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వంటి ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.ఎంపీపీ పదవి కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, పార్టీ అభివృద్ధికి, మండల ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
యాగంటి నాగలక్ష్మికి ఎంపీపీ బాధ్యతలు దక్కడం పట్ల వారి అనుచరులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సహకారంతో దుర్గి మండల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పేర్ల వెంకటేశ్వర్లు దుర్గి సీనియర్ రిపోర్టర్