telangana
ఎమ్మెల్యే మదన్ మోహన్ కలిసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన చంద్రశేఖర్
సూర్య ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన శ్రీమతి ఆకుల కల్పన చంద్రశేఖర్ మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకం పొందేందుకు సహకరించి, ప్రోత్సహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆకుల కల్పన చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆమెతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అరుణ ఉన్నారు