BREAKING
8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హరివరాసనం విశ్వమోహనం: శబరిమల ఆధ్యాత్మిక గీతం వెనుక విశేషాలు, వివాదాలు ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్* ముంబైలో జరుగుతున్న 3వ ప్రపంచ మేయర్ల సమావేశంలో ‘సర్క్యులర్ సిటీస్’ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌. -- *జాతీయస్థాయి అండర్ 14 స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు టి .లక్షిత్ కిషోర్ ఎంపిక* -- *కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన స్కూల్ గేమ్స్ కార్యదర్శులు లక్ష్మయ్య, అరుణకుమారి* ఆస్కార్ బరిలో 'రామాయణ' సత్తా.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ టాప్-20 జాబితాలో చోటు జాతీయ కబడ్డీ పోటీలకు కాసాని అకాడమీ క్రీడాకారిణులు* *నీరజ, నిషా ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు* అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా అందించాలి: ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి డీఈవో ఎల్ సుధాకర్ డిసెంబర్ 9,10 తేదీల్లో కర్నూలు బాలోత్సవం పిల్లలు కేవలం చదువుకే పరిమిత కాకుండా ఆటలు సాంస్కృతిక అంశాల పైన కూడా మక్కువ పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ తల్లిదండ్రులను కోరారు . బాలోత్సవ ఉత్సవాలో నిర్వహించే పోటీలలో పిల్లల్లో దాగీ ఉ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మల్లాపూర్‌లో పాస్టర్లకు దుస్తుల పంపిణీ మిస్ యూనివర్స్ 2026 కిరీటం కైవసం.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ బారెట్టో భక్తి, భావోద్వేగాల మేళవింపుతో 'హరివరాసనం' టీజర్ విడుదల.. మకరవిళక్కున థియేటర్లలోకి రేచింతలలో నూతన విద్యుత్తు లైన్ ప్రారంభం

కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

సూర్య జూలపల్లి : కార్తీక పౌర్ణమి పర్వదినం.. ఆధ్యాత్మిక శోభతో పెద్దాపూర్ నృసింహ క్షేత్రం పులకించిపోయింది. శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి 9వ గిరి ప్రదక్షిణ ఒకే రోజు నిర్వహించడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 6 వేల మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. జనసందోహంతో ఆలయ ప్రాంగణం, కొండ పరిసరాలు జాతరను తలపించాయి.జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో ప్రకృతి ఒడిలో దక్షిణాభిముఖంగా యోగముద్రలో స్వయంభువుగా వెలసిన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా, ఆపదలో అండగా నిలిచే ఆరాధ్య స్వామిగా భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణలతో ఈ క్షేత్రం అనతికాలంలోనే జిల్లాల పరిధిని దాటి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.ఈ ప్రాచుర్యం విస్తరించడంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ సంకల్పకర్త సురేష్ ఆత్మారాం మహారాజ్ గురూజీ భాగస్వామ్యం విశేషంగా నిలిచింది. 7, 8వ గిరి ప్రదక్షిణల్లో పాల్గొన్న ఆయన భక్తులకు సంకల్పాన్ని వివరించి ఆధ్యాత్మికంగా ప్రోత్సహించారు. ముఖ్యంగా ఎనిమిదో గిరి ప్రదక్షిణ సందర్భంగా పెద్దాపూర్ ఆలయం నుంచి కొండగట్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, అక్కడి గిరి ప్రదక్షిణలోనూ పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమాల ద్వారా పెద్దాపూర్ నృసింహ క్షేత్ర విశిష్టత, గిరి ప్రదక్షిణ మహత్యం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు.కార్తీక పౌర్ణమి పవిత్రతకు నృసింహస్వామి ఆరాధన తోడవడంతో ఈసారి గిరి ప్రదక్షిణకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. భక్తుల గోవింద నామస్మరణలు, నృసింహ నామ సంకీర్తనలతో కొండ ప్రాంతం ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయింది. వేలాదిమంది ఒకేసారి తరలిరావడంతో ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే రాష్ట్రస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదుగుతున్న పెద్దాపూర్ నృసింహ క్షేత్రానికి ఈ తొమ్మిదో గిరి ప్రదక్షిణ మరపురాని ఘట్టంగా నిలిచింది.