రేచింతలలో నూతన విద్యుత్తు లైన్ ప్రారంభం
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రేచింతల గ్రామంలో బుధవారం నూతన విద్యుత్ లైన్ ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ ప్రశాంతి కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా రైతులు గ్రామస్తులు విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడేవారని నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేది కాదని ప్రస్తుతం కొత్త లైన్లతో నిరంతరం విద్యుత్తు అందించేందుకు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నరేష్ కుమార్ యాదవ్, వాడు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
_ రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.