BREAKING
సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్ బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్ ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

అన్నదానం భగవంతునికి ప్రీతికరం

Select Suryaa Now
అన్నదానం భగవంతునికి ప్రీతికరం

కాకినాడ, మేజర్ న్యూస్ : కార్తీక మాసం సందర్భంగా భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలోప్రముఖ వైద్యులు డాక్టర్ ఐ.వి. రావు  సహకారంతో  జగన్నాధపురంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వేశ్వర స్వామి వారి ఆలయంలో 250కి పైగా భక్తులకు అన్న ప్రసాద వితరణ డాక్టర్ ఐ.వి.రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.  ఈ సందర్భముగా సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐ.వి. రావు  మాట్లాడుతు అన్నదానం భగవంతునికి ఎంతో ప్రీతికరమైనదని అందుకే భరద్వాజ సేవా సంఘం  ద్వారా ఈ కార్తీక మాసములో ప్రతీ వారం 250 మందికి పైగా భక్తుల చొప్పున నాలుగు వారాలు మొత్తం 1000 మందికి పైగా భక్తులకు వివిధ దేవాలయాలలో అన్న ప్రసాద వితరణ చేయదలిచామని చెప్పారు. అందులో భాగంగా మొదటివారం రామారావుపేట శివాలయంలో చేశామని, ఈ వారం ఇక్కడ జగన్నాధపురంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించామని చెప్పారు. 
        కార్యదర్శి ముంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ క్రితం సంవత్సరం కూడా సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐ.వి. రావు సహకారంతో భరద్వాజ సేవా సంఘం ద్వారా కార్తీక మాసంలో 1000 మందికి పైగా భక్తులకు వివిధ దేవాలయాలలో అన్న ప్రసాద వితరణ జరిగిందని చెప్పారు. కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ద్వారా గంగాది సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యం లభిస్తుందని అందుకే ఇటువంటి సత్కార్యక్రమాల   నిర్వహణకు భరద్వాజ సేవా సంఘం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరొకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా భక్తులకు సేవ చేయాలన్నదే తమ అభిమతం అని అందుకు అధ్యక్షుడు డాక్టర్ ఐ.వి.రావు సహకారంతో ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
        ఈ కార్యక్రమములో సంఘ కార్యదర్శి రంగభట్ల శ్రీనివాస రావు, సంఘ సభ్యులు కేవీస్ సీతారాం, వై.వి. సుబ్రహ్మణ్యం, మాండలీక వెంకటశాస్త్రి, ఏ.రామమోహనరావు, ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.