BREAKING
సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్ బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్ ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ

Select Suryaa Now
శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ

- వైభవంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి లక్ష బిల్వార్చన
- భారీ ఎత్తున పేటతుళ్ళు నిర్వహించిన అయ్యప్ప మాలధారులు
- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జ్యోతుల దేవి, అనీష్ నెహ్రూ
ప్రత్తిపాడు, మేజర్ న్యూస్ : మండలంలోని లంపకలోవ గ్రామంలో కార్తీక్ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి లక్ష బిల్వార్చన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజ్య గురువులు శ్రీ దండపాణి గురుస్వామి దివ్య ఆశీస్సులతో, బొల్లు గంగాధర్ గురుస్వామి,  ఆకొండి ప్రకాశ్ గురుస్వామిల ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది.
        ఉత్సవాలలో భాగంగా ఉదయం గణపతి హోమం, అనంతరం అయ్యప్ప స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అయ్యప్ప మాలధారులు భారీ ఎత్తున గ్రామ పురవీధుల్లో ‘పేటతుళ్ళు’ ఊరేగింపు నిర్వహించారు. భక్తుల “స్వామియే శరణం అయ్యప్ప” అనే శరణు ఘోషతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
        ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోడలు జ్యోతుల దేవి, మనవడు అనీష్ నెహ్రూ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో లంపకలోవ అయ్యప్ప స్వాముల బృందంతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.