telangana
మురుగునీరుతో ఇబ్బంది పడుతున్నాం
సూర్య, తంగళ్ళపల్లి: తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు రోడ్డుపై నడవలేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తుడు శ్యాగ మహేష్ ఉన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడారు.. పాఠశాల, గుడి కి వెళ్లి అదే రోడ్డు కావడంతో ప్రజలు రోడ్డుపై నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సర్పంచ్ శ్యాగ విజయను సూర్య వివరణ కోరగా ఆ రోడ్డు వైపు డ్రైనేజీ నిర్మిస్తామంటే పట్టా భూములు ఉన్నాయన్నారు. సమస్య మా దృష్టికి వచ్చిందని రెండు రోజుల్లో సమస్యన పరిష్కరిస్తామని ఆమె స్పష్టం చేశారు.